శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్

ఈ కారణాల వల్లే నిద్రకు దూరమవుతున్న యువత...

చాలా మంది వివిధ రకాల పనుల ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. ఆలోచనలు, కుటుంబ సమస్యలు, కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే గనుక ఇంకా కుంగిపోవడం ఖాయం కాబట్టి ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి.
 
కనీసం గంట నుంచి అరగంట వరకూ నిద్రపోయేలా చూసుకోండి. దాని ఫలితంగా ఆందోళన తగ్గుతుంది. తర్వాత మీరే ఉత్సహంగా ఉంటారు. మీరు స్నేహితులతో కాసేపు గడిపి చూడండి ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.
 
మీరు బాగా ఆనందంగా ఉన్న సందర్భాలనూ, సానుకూలంగా స్పందించిన పరిస్థితులూ ఊహించుకోండి. దాంతో మీ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. ఇలా చేయడం వల్ల మనసే కాదు శరీరానికీ విశ్రాంతి అందటంతో పాటు ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.
 
కొన్నిసార్లు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా ఆందోళన పెరిగిపోతుంది. మీరలా ఊహించుకునేవారైతే ఆ ఆలోచనలు పక్కనపెట్టి ఏదైనా పనిలో పడండి. వీలైనంత ఎక్కువసేపు పనిచేసేలా చూసుకోవడం వలన ఆందోళన ఉండదు. 
 
ఒక్కోసారి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా కంగారుగా, ఆందోళనగా అనిపిస్తుంటుంది. అందువలన మీరు మరుసటి రోజూ చేయాల్సిన పనుల్ని ముందే రాసి పెట్టుకోండి. వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. ఒకటి రెండు రోజులు మీ దినచర్య నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుని మీకు బాగా ఇష్టమైన పని చేసేలా చూసుకోవడం వల్ల ఆందోళను దూరం చేస్తుంది.