చుండ్రుతో తల జిల.... వదిలేస్తే చర్మరోగాలు ఖాయం...
చుండ్రు నివారణకు మాడు శుభ్రత అవసరం. చుండ్రు సమస్య నివారణకు రోజు మార్చి రోజు తలస్నానం చేయాలి. షాంపూ వాడకం తగ్గించి, శీకాయపొడి, కుంకుడుకాయలను వాడాలి. ఇతరుల దువ్వెనలు, టవల్స్‌ని తలకు వాడకూడదు. వేప ఆకులు, మెంతి, పెసర పొడులు మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.
ఉసిరిపొడి కొబ్బరినూనెలో కలుపుకుని తలకు రాసుకోవచ్చు. ఆహార విషయంలో నియమాలు పాటించాలి. పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం కావాలి. చుండ్రు తగ్గించుకునే యత్నం తగ్గించుకోకపోతే దాని నుండి ఇతర చర్మరోగాలు వచ్చే అవకాశముంది.. జాగ్రత్త..!