గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అదొక్కటి?
ఈమధ్యకాలంలో 25 యేళ్ళు దాటిన వారికి కూడా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. కొంతమందికి జీన్స్ సమస్య అయితే మరికొంతమందికి ఒత్తిడి కారణంగా ఈ జబ్బు వస్తోంది. గుండె జబ్బు కారణంగా ఒక్కోసారి ప్రాణాలు వెంటనే గాలిలో కలిసిపోతుంటాయి. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళితేనే బతకే పరిస్థితులు ఉంటాయి. గుండె పదిలంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి అంటున్నారు వైద్యులు.
ప్రతిరోజూ గ్లాసు పాలూ, ఒక కోడిగుడ్డూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. కానీ కోడి గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి గుండెకు మంచిది కాదన్న అభిప్రాయం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది తప్పు అన్న విషయం ఇటీవల ఒక అధ్యయనంలో తేలిందట.
కోడిగుడ్లు వల్ల గుండెకు హానిచేసే కొలెస్ట్రాల్ పెరగడానికి, కోడిగుడ్లు తినడానికి సంబంధం లేదని తేల్చారు. కెనాడా మెక్ మాస్టర్ యూనివర్సిటీ హామిల్డన్ హెల్త్ సైనెన్స్‌కి చెందిన పరిశోధకులు, లక్షా 77వేల మందిపై అధ్యయనం చేసిన అనంతరం వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు.
వారిలో సగానికి పైగా గుడ్లు, పాలు తీసుకునే వారున్నారు. వీరిలో 13,658 మంది గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నవారే. అయితే వీరి గుండెజబ్బుకీ, కోడిగుడ్డుకీ సంబంధం లేదన్న విషయం తేలింది. ప్రొటీన్లు, పోషకాలు లభించే కోడిగుడ్లు తినడమే మంచిదని పరిశోధకులు అంటున్నారు.