శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (15:04 IST)

నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ ఉదయం తీసుకుంటే?

నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ ఉదయం తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మధుమేహం పరారవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టిన బాదంలో విటమిన్‌ బి17 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలతోనూ పోరాడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కంతుల పెరుగుదలనూ అడ్డుకుంటాయి, బీపీనీ తగ్గిస్తాయి. వీటిల్లోని విటమిన్‌-ఇ ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మకణాలను రక్షించడం ద్వారా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది. 
 
నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. బాదంలో వుండే మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి పొట్టనిండిన అనుభూతిని కలిగిస్తాయి. దాంతో బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి గర్భిణీ మహిళలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.