శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 ఆగస్టు 2020 (23:08 IST)

అధిక సోడియం శరీరంలో పేరుకుంటే ముప్పే.. అందుకే అలాంటివి తినాలి

మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం చిటికెలో అదనపు సోడియంను వదిలించుకోవచ్చు, కానీ మీ శరీరంలో సోడియం అధికంగా పేరుకుపోతే ఇక దాని వల్ల కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అధిక-సోడియం వున్న ఆహారం అధిక రక్తపోటును తెస్తుంది. అంతేకాదు హార్ట్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
 
ఆహారంలో సోడియంను తగ్గించడానికి, ఫాస్ట్ ఫుడ్ మరియు చిప్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం పరిమితం చేయాలి. వాటికి బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అదనపు సోడియం లేకుండా తయారుచేసిన మాంసాలు వంటి తాజా ఆహారాన్ని తినండి.
 
హై-పొటాషియం ఆహారాల ప్రయోజనాలు
నీటితో పాటు, ఆహారంలో ఎక్కువ పొటాషియం జోడించడం ద్వారా సోడియంను కూడా తరిమివేయవచ్చు. పొటాషియం మరియు సోడియం ద్రవ సమతుల్యతను కాపాడటానికి కలిసి పనిచేస్తాయి. పొటాషియం తీసుకోవడం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇది మీ శరీరం ఎక్కువ సోడియంను విసర్జించడానికి సహాయపడుతుంది.
 
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలలో అరటిపండ్లు, బంగాళాదుంపలు, నారింజ, టమోటాలు, స్ట్రాబెర్రీలు, అవోకాడోలు, బీన్స్ ఉన్నాయి. మూత్రపిండాల పనితీరు తేడాకొడితే మాత్రం అధిక పొటాషియం కలిగిన ఆహారాన్ని తినడం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుడితో చర్చించాలి.