1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (20:18 IST)

మధుమేహం వున్నవారు పుచ్చకాయలను తినవచ్చా?

పుచ్చకాయ సీజనల్ ఫ్రూట్, ఇది వేసవికాలంలో లభిస్తుంది. మధుమేహం వున్నవారు ప్రతిరోజూ తమతమ గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకుంటూ వుంటారు. చాలామంది భోజనంలో కొన్ని తీపి వంటకాలను తినాలని అనుకున్నా ఇలాగే చెక్ చేసుకుంటూ వుంటారు. కనుక పుచ్చకాయ విషయంలోనూ అంతే. ఐతే పుచ్చకాయలో ఎంత మోతాదు చక్కెర వుంటుందో తెలుసుకోవాలి.
 
డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం ఎంత ముఖ్యమో తెలుసు. పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. మొత్తం ఆహారం, పుచ్చకాయ మొత్తాన్ని బట్టి, ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతుంది.
 
పుచ్చకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి- 6, ఫైబర్, ఇనుము, కాల్షియం వున్నాయి. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన దృష్టికి మేలు చేస్తుంది. గుండె, మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తుల నిర్వహణలో సహాయపడుతుంది.
 
విటమిన్ సి పుచ్చకాయలో లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని క్యాన్సర్ల నివారణకు సహాయం చేస్తుంది. జలుబు దరిచేరకుండా సాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున, పుచ్చకాయ తినడం వల్ల మంచి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మితమైన పుచ్చకాయ తినడం వల్ల ఆ కాయను తినాలన్న కోర్కె తీర్చుకోవచ్చు. అయితే అపరిమితంగా తింటే అనర్థం.