శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (14:46 IST)

అభ్యంగన స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?

శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ సూక్ష్మ రంధ్రాలు మూసుకుని పోతాయి. దీంతో మాలిన్యాలు పూర్తిస్థాయిలో బయటికి రాకుండా తిరిగి రక్తంలో కలిసిపోతుంటాయి.

శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ సూక్ష్మ రంధ్రాలు మూసుకుని పోతాయి. దీంతో మాలిన్యాలు పూర్తిస్థాయిలో బయటికి రాకుండా తిరిగి రక్తంలో కలిసిపోతుంటాయి. ఇలా రక్తం విషతుల్యమైతే శరీరం పలురకాల వ్యాధులను నిలయమవుతుంది. ఈ స్థితి రాకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా అభ్యంగన స్నానం చేయాలి. అలాంటి అభ్యంగన స్నానం చేసేందుకు కావాల్సిన వస్తువులను పరిశీలిస్తే.. 
 
కొబ్బరినూనె, నువ్వుల నూనె, వెన్న, ఆముందం, వీటిల్లో ఏదో ఒక నూనె తీసుకోవాలి. దీనికి తోడు సున్నిపిండి (శెనగపిండి లేదా మినప, పెసర, బియ్యం పిండి) శరీరానికి పట్టించి... సీకాయ, కుంకుమకాయ, నురుగుతో బాగా రుద్దుకుని స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. ముందు ఏదో ఒక తైలాన్ని తీసుకుని తల నుంచి పాదాల దాకా బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల దాకా అలాగే ఉండాలి. సున్నిపిండిని నీటితో తడిపి, శరీర భాగాలన్నింటికీ పట్టించి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గట్టిగా మర్ధన చేయాలి. అనంతరం సీకాయ లేదా కుంకుడు రసం చూర్ణంతో రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
 
స్నానానికి ఉపయోగించే నీటి వేడిమి 105- 110 డిగ్రీలు దాటకుండా ఉంటే మంచిది. పైవిధంగా వేడి నీటితో స్నానం పూర్తికాగానే, ఒక బకెట్‌ చన్నీటితో స్నానం చేయడం అవసరం. ఆ తర్వాత మెత్తటి టర్కీ టవల్‌తో తడి లేకుండా పరిశుభ్రంగా ఒళ్లంతా తుడుచుకోవాలి. ఆ తర్వాత పలుచుని దుస్తులు ధరించాలి. ఖద్దరు చేనేత దుస్తులు శ్రేష్టం. అయితే, అభ్యంగన స్నానం చేసిన గంట దాకా భోజనం లేదా ఘన పదార్థాలేవీ తీసుకోకూడదు. కాకపోతే అరగంట తర్వాత మజ్జిగ, పండ్లరసం, పాల వంటివి తీసుకోవచ్చు.