ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (08:26 IST)

తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని పొందడం ఎలా?

కొంచెం ఓపికగా, ఆలోచించి ఆహార పదార్థాలను ఎంపిక చేస్తే, అతి తక్కువ ఖర్చుతోనే అత్యధిక పోషకాలనిచ్చే ఆహారాన్ని రూపొందించవచ్చు. ఉదాహరణకు మాంసకృత్తుల సంగతే తీసుకుంటే, ఖరీదయిన మాంసాహారం స్థానంలో పప్పుధాన్యాలను వాడి తక్కువ ఖర్చుతో అంతే ఫలితాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఆలోచించి, మంచి ప్రణాళికతో ఈ క్రింద ఇవ్వబడిన సులభమైన సూత్రాలను పాటించి మంచి ఫలితాన్ని పొందండి.
 
1. ఆహారధాన్యాలు, పప్పుధాన్యాలు 5 :1 పాళ్ళ దామాషాలో ఎంచుకోండి.

2. ఆయా ఋతువులలో దొరికే చవుకయిన పండ్లు ఎన్నుకోండి. ప్రతిరోజూ ఏదో ఒక రకం అప్పుడు మార్కెట్లో లభిస్తున్న పండ్లను ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి.
 
3. స్థానికంగా అధికంగా లభించే పచ్చని ఆకు కూరలు ఎంచుకోండి. ఇవి మీకు బీటా కెరోటిన్, కాల్షియం, ఐరన్, రైబోఫ్లావిన్, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లను అతి తక్కువ ఖరీదులో అందిస్తాయి.
 
4. శాస్త్రీయమైన వంట విధానాలను, పాత్రలను ఉపయోగించి, వండేటపుడు పోషకాల నష్టాన్ని నివారించండి.
 
5. ప్రతి ఆహార విభాగంలోనూ, అంటే పిండి పదార్థాలు కానీ, మాంసకృత్తులు కానీ, ఖరీదయినవి, చవుకయినవీ ఉంటాయి. పోషక విలువలలో మాత్రం తేడా ఉండదు కాబట్టి, దేశీయంగా, స్థానికంగా ఉత్పత్తి అవుతున్న చవుకగా లభిస్తున్న ఆహారపదార్థాలనే ఎన్నుకోండి.
 
6. ఆహారంగా తయారు చేసేటప్పుడు పదార్థాల పోషక విలువలు నష్టపోకుండా ఉండే వంట విధానాలను ఎంచుకోండి. వేయించడం, మొలకెత్తించడం పులియబెట్టడం ఏది చేసినా, పదార్థాల పోషక విలువలు ఇనుమడించి, తేలికగా జీర్ణమై, పోషకాలు త్వరగా శరీరంచేత గ్రహించబడేట్లుగా ప్లాన్ చేయండి.
 
7. మధ్యాహ్నం భోజనం టైం లో క్యారెట్ బీట్రూట్ కీరదోస టమాటా 300 గ్రాములు తీసుకోండి. పచ్చి కూరగాయలు తినడం వల్ల, పోషక విలువలు నశించకుండా సమృద్ధిగా శరీరానికి అందుతాయి. అన్నం తక్కువగా తీసుకుంటారు.
చాలామంది డ్యూటీ కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ తీసుకొని వెళతారు. ఉద్ యంపూట చేసిన ఆహార పదార్థాలు చల్లబడి ఉంటది. మొక్కుబడిగా తింటాము. మీ ఆహరం తో పాటు నేను చెప్పిన కూరగాయలు తీసుకెళ్లండి.
 
8. నువ్వులు బెల్లంతో చేసిన లడ్డులు ఎక్కువ క్యాల్షియం ఉండటం వలన, బలము ఎముకలు గట్టిపడతాయి జుట్టు రాలకుండా ఉంటుంది.
 
9. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్డు, లేస్ కురుకురే చిప్స్ ఇవ్వకుండా పల్లి చిక్కీ లు నువ్వు ల చీక్కి లు పిండివంటలు సున్నుండలు కొబ్బరి లడ్డు చేసి ఇవ్వండి.
 
10. డాక్టర్ దగ్గరికి వెళితే ముందు విటమిన్ గొలిలు రాస్తున్నారు. నిమ్మ నారింజ జామ లాంటి పండ్లు తినండి సి విటమిన్ పుష్కలంగా ఉంది.
 
11. ఈ సీజన్ లో మనకు మామిడి పండ్లు చాలా చౌకగా దొరుకుతున్నాయి, ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. మధుమేహం ఉన్న వాళ్లు కూడా తినవచ్చు భయపడకండి. చాల మంది మధుమేహం ఉన్నవాల్లు మామిడి పండు తినడానికి భయపడుతున్నారు. అన్ని రకాల పండ్లలో ప్రకటోస్ అనే తియ్యని సహజ సిద్ధమైన పదార్థం ఉంటాది
ఆరోగ్యానికి మంచిది

అల్లోపతిలో డాక్టర్లు కొందరు పండ్లు తినకూడదని , జామ బొప్పాయి మాత్రమే తినాలి అని చెబుతున్నారు. మధుమేహగ్రస్తులకు తప్పుదోవ పట్టిస్తున్నారు. మధుమేహం ఉన్న వారూ ఆన్ని రకాల సీజనల్ పండ్లు పండ్ల తినవచ్చు.. తిన్నా వారికి షుగర్ లెవెల్స్ ఏమి పెరగలేదు.