శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (19:54 IST)

దంతాలు దృఢంగా వుండాలంటే అది తాగాల్సిందేనంటున్న పరిశోధకులు

రెడ్ వైన్ సేవించడం వలన గుండె, వివిధ రకాల క్యాన్సర్‌ల బారిన పడకుండా కాపాడబడుతుందని ఎన్నో పరిశోధనల ద్వారా తెలుసుకున్నాం. కాని మరో పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే దంత సంరక్షణలోను రెడ్ వైన్ చాలా ఉపకరిస్తుందట. ఈ విషయాన్ని ఇటలీలోని పేవియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. 
 
వారు ఈ మేరకు వెల్లడించిన వివరాలలో స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియా దంతాలకు ప్రథమ శత్రువని తెలిపారు. చక్కెర ఎక్కువగా తింటుంటే దంతాలలోకి ఈ బ్యాక్టీరియా చాలా సులువుగా చొరబడుతుందన్నారు. చక్కెర ఎక్కువగా తినేవారిలో ఈ బ్యాక్టీరియా ప్రవేశించి దంతాలకు రంధ్రాలు చేసేస్తుందట. దీంతో దంతాలు పాడైపోతాయని పరిశోధకులు తెలిపారు.
 
రెడ్ వైన్‌లోనున్న రసాయనాలు దంతాలకు హాని చేసే స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. తద్వారా రెడ్ వైన్ దంతాల్లో చేరే బ్యాక్టీరియాను అంతం చేస్తుందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. రెడ్ వైన్ తీసుకుంటే దంతాలు ధృడంగా ఉండడంతో పాటు తెల్లగా మెరిసిపోతాయని వారు వెల్లడించారు.
 
దంతాలను సురక్షితంగా ఉంచుకోవాలని రెడ్ వైన్ తీసుకుంటేనే బ్యాక్టీరియా నశిస్తుందునుకోవడం పొరపాటన్నారు. ఇందులోనున్న ఇతర పదార్థాలలో ఈ బ్యాక్టీరియాను సంహరించే గుణం ఉన్నట్టు వెల్లడించారు.