గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (11:02 IST)

ఆస్తమాకు దివ్యౌషధం ఆ కాయ? ఏ కాయ?

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. డైట్‌లో బెండకాయను తీసుకోవడం ద్వారా ఆస్తమాను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఆస్తమా వ్యాధిగ్రస్తులు భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గ

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. డైట్‌లో బెండకాయను తీసుకోవడం ద్వారా ఆస్తమాను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఆస్తమా వ్యాధిగ్రస్తులు భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. 
 
అలాగే ఆధునిక జీవనశైలి తెస్తున్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకు తోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబిసిటీ వేధిస్తోంది. దీనికి మంచి ఔషధం బెండ. ఇది అధిక బరువును తగ్గించడమే కాడు దీనికి మంచి ఔషధం బెండ ప‌ని చేస్తుందంటున్నారు. అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది. 
 
అలాగే బెండకాయ రసంలో ఇన్సులిన్ గుణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉండటం ద్వారా మధుమేహం తగ్గుముఖం పడుతుంది. బెండకాయ రసాన్ని రోజూ తీసుకుంటే మధుమేహం మటాష్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.