బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (15:30 IST)

వృద్ధులు రోజూ పాలకూర తీసుకుంటే.. ఎంత మేలో తెలుసా?

వృద్ధులను మతిమరుపు వేధిస్తుంది. అలాంటి వారు పాలకూర తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వయసు పైబడిన వారు రోజూ పాలకూర తినడం వల్ల యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుం

వృద్ధులను మతిమరుపు వేధిస్తుంది. అలాంటి వారు పాలకూర తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వయసు పైబడిన వారు రోజూ పాలకూర తినడం వల్ల యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరం ఒత్తిడికి లోనుకాకుండా సాంత్వన పొందుతుంది. అలాగే వృద్ధుల్లో కంటి చూపు మెరుగుపడాలంటే.. పాలకూరను రోజుకో కప్పు డైట్‌లో చేర్చుకోవాలి.
 
చర్మానికి మేలు చేసే పాలకూర యాంటీ-ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తపోటు సాధారణస్థాయిలో ఉండేలా.. గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. జీవక్రియను, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పాలకూరలోని విటమిన్‌-కె వల్ల కాల్షియం ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఎముకలు బలంగా వుంటాయి.
 
అలాగే గర్భిణీ స్త్రీలకు పాలకూర ఎంతో మేలు చేస్తుంది. కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరిగేలా, నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా సహాయపడుతుంది. ఇక పాలకూరను తీసుకుంటే... ఎసిడిటీ తగ్గిపోతుంది. క్యాన్సర్‌ బారిన పడకుండా నిరోధిస్తుంది. పాలకూరలో ఫ్యాట్‌, క్యాలరీలు తక్కువ. అందుకే దీన్ని తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.