శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 నవంబరు 2019 (21:38 IST)

అక్కడ కూడా సుగంధ పరిమళాలు చల్లుకుంటున్నారు...

పెర్‌ఫ్యూమ్స్... ఏ పార్టీకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా అక్కడి ఆవరణం అంతా పెర్‌ఫ్యూమ్ వాసనతో నిండిపోతుంది. ఒక పెర్‌ఫ్యూమ్ మీ స్వాభావాన్ని తెలుపుతుందట. స్వభావం తెలపడం పక్కన పెట్టి దానివలన అనేక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
సుగంధ పరిమళాలను ఉపయోగించడం వల్ల కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్ తలనొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. అవి చర్మానికి తగలడం, వాటి వాసనతో అలర్జీలు, మైగ్రేన్ తరహా తలనొప్పులతో పాటు అనేక రకాల చర్మవ్యాధులు వస్తువులున్నాయని పేర్కొన్నారు. మనం వాడే సుగంధ ద్రవ్యాలు కృత్రిమ రసాయనాలను కలిగి ఉంటాయి, వీటి వలన చర్మానికి ప్రమాదం కూడా కలగవచ్చు. 
 
కనుక బాదం నూనె, కొన్ని చుక్కల సుగంధ తైలంను కలిపిన మిశ్రమాన్ని చర్మానికి వాడటం వలన మంచి వాసనను వెదజల్లుతుంది. దీని వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద సుగంధ పరిమళాలను ఉపయోగిస్తుంటారు. వాళ్ళు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ వంటివి జల్లుకుంటారు. అయితే ఆ ప్రదేశంలో సుగంధ పరిమళాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అండర్ గార్మెంట్స్ తొడుక్కోవడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.