1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (21:10 IST)

కడుపునిండా లాగించారా..? అయితే ఓ చిన్న అనాస ముక్కను తింటే?

కడుపునిండా లాగించారా..? ఐతే సులభంగా జీర్ణం కావాలంటే.. చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత అనాస ముక్కను తీసుకుంటే సులభంగా తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. 
 
సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది. అలాగే అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు.. మేని ఛాయ కూడా నిగారింపు కూడా వస్తుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు. ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఒక గ్లాసు అనాస జ్యూస్ తాగడం మంచిది. 
 
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.