జీర్ణశక్తి ఒకే ఒక్క టీ.. ఎలా తయారుచేసుకోవాలంటే..?
కొంతమంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీలు తాగితే ఇబ్బందేమీ ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే లిమిటెడ్‌గా తాగితే మాత్రం కాఫీ, టీలు ఆరోగ్యానికి మంచిదన్న వారు లేకపోలేదు.
అయితే ప్రస్తుత సీజన్లో మాత్రం జీర్ణవ్యవస్థ బాగా పనిచేయాలన్నా, చురుగ్గా ఉండాలన్నా లెమన్, జింజర్ ఐస్డ్ టీ బాగా మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ ఈ టీకి కావాల్సిన పదార్థాలు, తయారుచేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఒక నిమ్మకాయ స్లైస్‌లు, అల్లం ముక్కలు, రెండు గ్రాములు లెమన్ అండ్ హని టీ బ్యాగ్, 100 ఎం.ఎల్. గోరువెచ్చని నీరు, ఏడెనిమిది ఐస్ క్యూట్స్, 150 ఎం.ఎల్. చల్లని నీరు, కావాలనుకుంటే ఒక టీస్పూన్ తెనె.
గోరువెచ్చని నీటిలో టీ వేసి ఏడెనిమిది నిమిషాలు ఉంచాలట. బ్లెండర్లలో ఐస్ క్యూబ్స్ టీ నీరు, తేనె కలిపి బ్లెండ్ చేయాలట. టీ మగ్‌లో పోసి చల్లని నీరు కలిపి లెమన్ స్లైసులు అల్లం ముక్కలతో అలంకరించి చల్లని నీరు కలిపి తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.