పొట్ట పెరగకుండా వుండాలంటే.. చేపలు తినాల్సిందేనా?

Last Updated: సోమవారం, 19 నవంబరు 2018 (13:36 IST)
సముద్రపు చేపలను తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా వుంటాయి. సముద్రపు చిన్న చేపలను ముల్లుతో పాటు తీసుకున్నప్పుడు శరీరానికి సరిపడా ఐరన్, క్యాల్షియం లభిస్తుంది. సీ ఫుడ్స్‌ అయిన చేపల్లో ఎక్కువగా మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్పరస్ వుంటాయి. 
 
పొట్ట పెరగకుండా వుండాలంటే వారానికి కనీసం రెండుసార్లయినా చేపలు తినడం మంచిది. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం ద్వారా కడుపులో వున్న బిడ్డకు ప్రోటీన్లు అందుతాయి. గర్భస్థ శిశువు మెదడుకు మేలు చేస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు వారానికి మూడుసార్లు చేపలు తినాలి. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :