గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 24 మే 2018 (16:07 IST)

నీటిని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? కాస్త ఆగండి..

నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌క

నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని లీటర్లు లీటర్లు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి. అవసరానికి మించి నీటిని తీసుకుంటే శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. తద్వారా ఓవర్ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. 
 
ఓవర్ హైడ్రేషన్ కారణంగా శరీరంలో.. రక్తంలో సోడియం నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త ఛార్లెస్ బోర్క్ హెచ్చరించారు. దీన్నే వైద్య పరిభాషలో హైపోనేట్రీమియా అంటారు. దీనివల్ల మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే 35 ఏళ్లకు మించిన వారు పరిమితంగా నీళ్లు సేవించడం మంచిది. లేకుంటే మెదడు వాపుకు గురయ్యే ఆస్కారం వుందని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిమిత నీటి సేవనం ద్వారా తలకు సంబంధించిన సమస్యలు, ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలామటుకు తగ్గుతుంది. మెదడు దెబ్బతినడం, హృద్రోగ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు.