బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (15:59 IST)

ఎలాంటి కండిషన్స్ లేవు... నూరు శాతం కవరేజి చెల్లింపు

health insurance
అనారోగ్య సమస్యలు బారినపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, అనేక హెల్త్ కంపెనీలు క్లైమ్‌లు చెల్లించే సమయంలో సవాలక్ష షరతులు పెడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు వర్తించదు అన్న ఒకే ఒక్క ముక్కతో తోసిపుచ్చుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అకో జనరల్ ఇన్సూరెన్స్ ఓ సరికొత్త ఆరోగ్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఈ సంస్థ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్లాటినం హెల్త్ ప్లాన్ పేరుతో చక్కని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. పాలసీదారుడు వైద్యం కోసం క్లెయిన్ పెట్టుకుంటే చెల్లించే మొత్తంలో ఎలాంటి కోత పెట్టదు. అంటే ఎంచుకున్న బీమా పరిధిలో నూరు శాతం చెల్లింపులు చేస్తుంది. అలాగే, అనేక మినహాయింపులను ఇస్తుంది. 
 
సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత నుంచి అన్ని రకాల క్లెయిమ్‌లకు వెంటనే అర్హత రాదు. కొన్ని రకాల చికిత్సల కోసం కనీసం 24 నెలల వెయింటింగ్ పీరియడ్, అప్పటికే ఉన్న వ్యాధులకు నాలుగేళ్ళ వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంటుంది. పాలసీ తీసుకున్న నెల రోజుల తర్వాత నుంచి ప్రమాదాలు, వైరల్ ఫీవర్స్, కామెర్లు తదితర ఊహించని వాటికే కవరేజి ఉంటుంది. కానీ, అకో ప్లాటినం హెల్త్ ప్లాన్‌లో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్‌ అమలుకాదు. పాలసీ తీసుకున్న తొలి రోజు నుంచే దేనికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు.