మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (19:55 IST)

కిడ్నీలో రాళ్లు క్యారెట్ తింటే ఏమవుతాయి? (video)

క్యారెట్ ఆహారంగాను, ఔషధంగాను ఉపయోగపడుతుంది. క్యారెట్ జీర్ణం కావడానికి  సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. రోజు క్యారెట్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్, జీర్ణశయ సంబంధ క్యాన్సర్ బారినపడకుండా ఉండవచ్చు. క్యారెట్లో పీచు పదార్ధం ఎక్కువుగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది. 
 
1 . ప్రతిరోజు రాత్రి ఒక కప్పు క్యారెట్ రసంలో ఒక గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే మానసికంగా శ్రమపడే వారికి ఎంతో ఉపయోగపడటమే కాకుండా ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
 
2 . శుభ్రంగా కడిగిన పచ్చి క్యారెట్ దుంపను తినడం వల్ల నులిపురుగు లాంటి సమస్యలు తొలగడంతో పాటు, రక్తం శుభ్రపడుతుంది.
 
3. క్యారెట్లో ఎ విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల అది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
 
4. మూత్రశయం, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు మిగతా మందులతో పాటు క్యారెట్‌ను సేవిస్తే ఇందులోని కెరోటిన్ అనే పదార్థం శీఘ్ర గుణకారిగా ఉపయోగపడుతుంది. అంతేకాక మళ్లీ రాళ్లు తయారుకాకుండా నిరోధిస్తుంది.
 
5. ఒక టీస్పూన్ క్యారెట్ విత్తనాలను ఒక గ్లాసు ఆవు పాలలో దాదాపు పది నిమిషాలు మరిగించి తీసుకుంటే పురుషులలో శీఘ్ర స్ఖలనం సమస్య తగ్గుతుంది.