బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (18:30 IST)

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

Belly Fat
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధించే స‌మ‌స్యలవుతున్నాయి. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాల గురించి తెలుసుకుంటే బ‌రువు పెర‌గ‌కుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు. అవేమిటో తెలుసుకుందాము.

యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శ‌రీరంలో చెడు కొవ్వు స్థాయిలు త‌గ్గుతాయి.
ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది.
అవకాడో తీసుకోవ‌డం వ‌లన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడ‌తాయి.
గింజ ధాన్యాల వల్ల‌ శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని త‌గ్గించుకోవ‌చ్చు.
బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌, ర‌క‌ర‌కాల రూపాల్లో ల‌భించే బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు త‌గ్గించుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.