శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2020 (22:27 IST)

పొడిదగ్గు తగ్గటానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు...

చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, కొంచెము తేనెలో కలిపి సేవించిన తర్వాత ఒక కప్పు వేడిపాలు తీసుకున్నట్లయితే పొడిదగ్గు తగ్గిపోతుంది.
 
చిటికెడు ఉప్పు, కొంచెం కర్పూరం, చిన్న చెంచాడు లవంగ చూర్ణానికి చేర్చి పన్నుపోటు వద్ద రాస్తే ఉపశమనం కలుగుతుంది.
 
మందార చెట్టు వేర్లు నూరి నువ్వుల నూనెలో కలిపి సేవించినట్లయితే స్త్రీల రక్తస్రావము అరికట్టుతుంది.
 
నీరుల్లిపాయలు పచ్చివి రెండు లేదంటే మూడు భుజించినట్లయితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
 
ప్రతిరోజూ ఉదయం రెండు తులాల ఉల్లిపాయరసంలో ఒక తులం తేనె కలిపి సేవిస్తుంటే వీర్యవృద్ధి కలుగుతుంది.
 
ప్రతిరోజూ నారింజరసం తీసుకుంటుంటే అజీర్తి తొలగి ఆకలిని వృద్ధి చేస్తుంది.