శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 అక్టోబరు 2021 (23:01 IST)

దగ్గును తగ్గించేందుకు యాలుక్కాయ

యాలకులు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. ఇవి అల్లంలా పనిచేసి, ఆ సమస్యలన్నీ తగ్గిస్తాయి. వికారం, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వీటి వాడకం మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు.
 
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో దీన్ని మించిన సుగంధ దినుసులు లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. నోటి దుర్వాసనను తగ్గించడమే కాదు... నోట్లో అల్సర్లూ, ఇన్‌ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి.
 
యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుతాయి