బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 సెప్టెంబరు 2021 (23:04 IST)

ఆస్తమా అదుపుకు జాగ్రత్తలు ఇవే

ఆస్తమా. దీన్ని అదుపులో ఉంచేందుకు జాగ్రత్తలు పాటించాలి. ఇది ఎలర్జీ కారణంగా తలెత్తుతుంటుంది. ఇల్లు ఊడిస్తే ధూళి రేణువులు గాల్లోకి లేచి శ్వాసనాళాల్లోకి చేరుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తడి బట్టతో ఇల్లు తుడవాలి.
 
చీపుర్లకు బదులుగా వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఉపయోగించి నేల మీద దుమ్మును తొలగించాలి. కర్టెన్లలో దుమ్ము, పుప్పొడి రేణువులు అతుక్కుని ఉంటాయి. అందుకే వీటిని క్రమం తప్పకుండా ఉతకాలి.
 
నేల శుభ్రం చేసే క్లీనర్స్‌లోని రసాయనాలు ఆస్తమాను పెంచుతాయి. ఇంటికి పెయింట్లు వేస్తున్నప్పుడు ఆస్తమా పేషెంట్లను దూరంగా ఉంచాలి. వీటిలోని రసాయనాల వల్ల ఉబ్బసం పెరుగుతుంది. ఆస్తమాకు కారణమయ్యే అలర్జెన్స్‌ను గుర్తించటం కోసం ఇమ్యునాలజిస్ట్‌ను కలిసి టెస్ట్‌ చేయించుకోవాలి.
 
కొన్నిసార్లు బాధ, దుఃఖం, ఆవేశం లాంటి భావోద్వేగాలు కూడా ఆస్తమాను పెంచుతాయి. కాబట్టి భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. ఇన్‌హేలర్స్‌ ఎప్పుడూ చేతికి అందేంత దగ్గర్లో ఉంచుకోవాలి. పిల్లలు వాడుతుంటే కనుక వాళ్లకు బడిలో ఆస్తమా అటాక్‌ వచ్చినప్పుడు ఇన్‌హేలర్స్‌ ఎలా ఉపయోగించాలో వాళ్ల టీచర్‌కు చెప్పాలి.
 
అలర్జీ ఉన్న పిల్లలు దుమ్ము ఇరుక్కునే అవకాశం ఉండే సాఫ్ట్‌ టాయ్స్‌తో ఆడకూడదు. ఆస్తమా పేషెంట్లు ఉన్న ఇంట్లో పెంపుడు జంతువులను పెంచకూడదు. క్రమం తప్పక సువాసన లేని నూనెతో మసాజ్‌ చేయించుకుంటూ ఉండాలి. 
 
కూల్‌డ్రింక్స్‌, వేపుళ్లు, పచ్చళ్లు, పెరుగును తినకూడదు. మరీముఖ్యంగా రాత్రివేళ వీటికి దూరంగా ఉండాలి. అలర్జీకి కారణమయ్యే పదార్థాలేవో తెలుసుకుని వాటి లిస్ట్‌ తయారుచేయాలి. ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి.