సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:40 IST)

గణపతి తులసిని ఇష్టపడడట.. ఎందుకో తెలుసా..?

తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి తులసిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. గరిక దగ్గర నుండి అన్ని రకాల అడవిపూలు... ఆకులు గణపతి పూజకు వాడుతున్నప్పుడు, తులసిని ఎందుకు వాడకూడదనే సందేహం రావడం సహజమే. ఐతే ఇది చదవండి. వినాయకుడిని చూసిన ధర్మధ్వజ యువరాణి, ఆయన శక్తి సామర్ధ్యాలను గురించి తెలుసుకుంది.
 
వినాయకుడిని మోహించి తనని వివాహం చేసుకోమంటూ ప్రాధేయపడింది. అందుకు వినాయకుడు ససేమిరా అంగీకరించకపోవడం ఆమెకి ఆగ్రహావేశాలను కలిగించింది. దాంతో బ్రహ్మచారిగానే ఉండిపొమ్మంటూ శపించింది. అందచందాలను కోల్పోయి అసురులతో కలిసి జీవించమని వినాయకుడు ప్రతి శాపమిచ్చాడు.
 
దాంతో తన తొందరపాటును మన్నించమంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుని, శాపకాలాన్ని తగ్గించమని కోరింది. దాంతో కొంతకాలంపాటు రాక్షసులతో కలిసి జీవించాక, తులసిగా జన్మిస్తావంటూ వినాయకుడు ఉపశమనాన్ని కలిగించాడు. తనని శపించిన ఆమె అవతారమే తులసి కావడం వలన తన పూజలో తులసిని వాడడం వినాయకుడు ఇష్టపడడని ఆధ్యాత్మిక గ్రంధాలు తెలుపుతున్నాయి.