పక్షులకు కొంత ధాన్యం- పశువులకు కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం
పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం.. ఇదే జీవితం అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. అలాగే ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతవుతాడని.. కానీ ఉన్నత పదవి వల
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల మాటలు మీ కోసం..
పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం.. ఇదే జీవితం అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. అలాగే ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతవుతాడని.. కానీ ఉన్నత పదవి వల్ల కాదని ఆయన తన ప్రవచనాల్లో తెలిపారు.
ఇంకా కొన్ని..
మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషి గుర్తింపు రాదు.
కేవలం డబ్బుంటే సరిపోదు- మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది.
ఎవరి వయస్సుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం లభిస్తుంది.
మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం - అతి చెడు గుణాలు.
నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.