శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (15:52 IST)

ఆస్కార్ నామినేట్ బాలనటుడు.. రాహుల్ కోలి మృతి.. సంస్మరణ సభ

Rahul Film
Rahul Film
ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన చిత్రం చెల్లో షో సినిమాలో నటించిన ఆరుగురు బాలనటుల్లో ఒకడైన రాహుల్ కోలి (15) మృతి చెందాడు. రాహుల్ కోలి గత కొంతకాలంగా ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) తో పోరాడుతున్నాడు. నాలుగు నెలల నుంచి అతడికి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే పరిస్థితి విషమించడంతో రాహుల్ కోలి ఈ నెల 2న కన్నుమూశాడు. బాలనటుడి కుటుంబం గుజరాత్‌లోని జామ్ నగర్ వద్ద స్వస్థలం హాపాలో నిన్న సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. తమ సినిమాలో అద్భుతంగా నటించిన రాహుల్ ఇకలేడని తెలిసి 'చెల్లో షో' చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.