1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By chitra
Last Updated : గురువారం, 21 జనవరి 2016 (12:55 IST)

రొమాంటిక్‌గా ఉండాలంటే... గోడలకి పింక్ కలర్ బెస్ట్

చాలా మందికి వారి ఇంటికి ఎటువంటి కలర్ పెయింట్ చేస్తే అందంగా ఉంటుందో అని ఆలోచించకుండా ఏదో ఒక రంగును వేసేస్తుంటారు. కానీ అందంగా ఉండే ఇంటికి నిండుదనం ఇచ్చేది గోడులకున్న పెయింటేనని మర్చిపోవద్దు. మీ ఇళ్లు ఫర్ఫెక్ట్‌గా కనిపించాలంటే డార్క్ కలర్స్‌ను ఎంచుకోవడం మంచిది. కానీ కొంతమందికి ఏఏ కలర్స్ ఎక్కడ వాడాలో తెలీదు. అలాంటివారి కోసం కొన్ని చిట్కాలు... 
 
బెడ్ రూమ్‌కి ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే ఒక రొమాంటిక్ వాల్ కలర్ పింక్. ఈ పింక్ కలర్ రొమాంటిక్‌గా అనిపించడం మాత్రమే కాకుండా వింటర్ సీజన్‌కు ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది.
 
లివింగ్‌రూమ్‌కి పెయింటింగ్ ఒక ఛాలెంజ్ వంటిది. లివింగ్ రూమ్‌కు బెస్ట్ వింటర్ కలర్ క్రిమ్సన్. ఈ కలర్ మీ లివింగ్ రూమ్ యొక్క విలువను మరింత పెంచుతుంది.
 
మీ వంటగదికి అద్భుతంగా ఇమిడిపోయే కలర్ చాక్లెట్ కలర్. ఆహార ప్రియులకు ఇదొక ఐడియల్ కలర్.
 
మీ బాత్ రూమ్ మరింత సున్నితంగా కనబడాలంటే స్కై బ్లూను కల‌ర్ వేస్తే చాలా బాగుంటుంది.
 
పూజ గదికి పసుపు రంగు వేస్తే పరిపూర్ణంగా ఉంటుంది.