బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Vasu
Last Modified: గురువారం, 23 ఆగస్టు 2018 (18:35 IST)

ఫేస్‌బుక్ థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నారా... గోవిందా...

ఫేస్‌బుక్‌లోని థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగించడం వలన ఏర్పడే నష్టాలు తాజాగా మరోసారి బయటపడ్డాయి. అయితే, ఈ సారి మై పర్సనాలిటీ అనే యాప్ వంతు. సదరు యాప్ 40 లక్షల మంది వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్‌బుక్ విచారణలో బయటపడింది. దీంతో ఈ యాప్‌ను

ఫేస్‌బుక్‌లోని థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగించడం వలన ఏర్పడే నష్టాలు తాజాగా మరోసారి బయటపడ్డాయి. అయితే, ఈ సారి మై పర్సనాలిటీ అనే యాప్ వంతు. సదరు యాప్ 40 లక్షల మంది వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేసినట్లు ఫేస్‌బుక్ విచారణలో బయటపడింది. దీంతో ఈ యాప్‌ను ఫేస్‌బుక్ తొలగించింది. 
 
ఫేస్‌బుక్ ఒక ప్రకటన జారీ చేస్తూ, "మై పర్సనాలిటీ అనే యాప్‌ను ఫేస్‌బుక్ నుంచి నిషేధిస్తున్నాం. వాళ్లు వినియోగదారుల సమాచారాన్ని ఇతర కంపెనీలతో పంచుకున్నట్లు మా విచారణలో తేలింది" అని వెల్లడించింది. కాగా సదరు యాప్ 2012కు ముందు బాగా యాక్టివ్‌గా ఉండేది, ఈ యాప్ ద్వారా తమ డేటాను పంచుకున్న సుమారు 40 లక్షల మంది వినియోగదారుల డేటా దుర్వినియోగం అయినట్లు సంస్థ తెలిపింది.
 
అయితే, ఇప్పటికే ఆయా యూజర్లకు ఈ సమాచారాన్ని తెలియజేసినట్లు కూడా చెప్పింది. ఆ వినియోగదారుల ఫ్రెండ్స్ సమాచారాన్ని కూడా దుర్వినియోగం చేసారా లేదా అన్న విషయంపై తమకు ఇంకా స్పష్టత లేదని, కాబట్టి ప్రస్తుతానికి వాళ్లకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాం తర్వాత ఈ ఏడాది మార్చిలో వేలాది థర్డ్ పార్టీ యాప్స్‌పై ఫేస్‌బుక్ జరిపిన విచారణలో అనుమానాస్పదంగా అనిపించిన సుమారు 400 యాప్‌లను తొలిగించినట్లు పేర్కొన్నారు. యాప్‌లపై విచారణ కొనసాగిస్తూనే ఉంటామని కూడా ఫేస్‌బుక్ పేర్కొంది.