బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఐపీఎల్ 2017 : నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ పూణె సూపర్ జెయింట్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా మలిదశ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం జరిగే తొలి పోరుతో ఈ పోటీలు ఆరంభమవుతాయి. తొలి పోరులో ముంబై ఇండియన్స్‌తో పూణె సూపర్ జెయింట్ తలపడుతుంది. పా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా మలిదశ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం జరిగే తొలి పోరుతో ఈ పోటీలు ఆరంభమవుతాయి. తొలి పోరులో ముంబై ఇండియన్స్‌తో పూణె సూపర్ జెయింట్ తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఈరెండు జట్లు... నేడు తలపడనున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గినా నేరుగా ఫైనల్ చేరనుండగా, ఒడిన జట్టు తర్వాతి ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది. అందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడే ఒక జట్టు హైదరాబాదులో మాత్రమే ఆడనుండగా, మరో జట్టు మాత్రం మరో అడ్డంకిని అధిగమించగలిగితే మాత్రమే హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఫైనల్‌కు చేరనుంది. 
 
నేటి సాయంత్రం 8 గంటలకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పూణే సూపర్ జెయింట్ తలపడనుంది. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మ్యాచ్‌లో విజేతతో తలపడాల్సి ఉంటుంది.