బతికున్నంత కాలం బెంగళూరు తరపునే ఆడాలనుకుంటున్నా: చాహల్

Chahal
మోహన్ మొగరాల| Last Modified మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (18:18 IST)
ఫోటో కర్టెసీ- ఏఎన్ఐ
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఉన్నంత కాలం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫునే ఆడాలనుకుంటున్నానని భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నాడు.

ఆర్సీబీ జట్టు తనకు ఓ కుటుంబం లాంటిది అన్నాడు. 2014వ సంవత్సరంలో ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు ఒకే జట్టు తరపున ఆడతానని అనుకోలేదన్నాడు. బెంగళూరు జట్టు తరపున ఆడటం ఎంతో ఆస్వాదిస్తున్నా అని అన్నాడు. జీవితాంతం ఆ జట్టులో ఆడాలని కోరుకుంటున్నా అని తెలిపాడు.

చిన్నస్వామి స్టేడియంలో ఆడేటప్పుడు అభిమానుల మద్దతు ఎంతో ఉంటుందని, అభిమానుల కోలాహలంతో కొన్నిసార్లు బంతి ఎక్కడ వేస్తున్నానో అని అర్థం కాదని అన్నాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ.. జట్టు కెప్టెన్ వెన్నంటే ఉంటే ఏ ఆటగాడైనా మంచి ప్రదర్శనను ఇవ్వగలడని పేర్కొన్నాడు. టీమ్ యాజమాన్యం కూడా తెర వెనకాల ఉండి అన్నివిధాలుగా సహకరిస్తుందని అన్నాడు.దీనిపై మరింత చదవండి :