1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 మే 2016 (15:31 IST)

ఐపీఎల్‌కు క్రేజ్ తగ్గిపోయిందా..? ధోనీ.. రైనా డలైపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారా?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంత క్రేజుండేదో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ ఫీవర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలకీ ఐపీఎల్ సెగ గట్టిగానే తాకింది. థియేటర్లలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రదర్శించే స్థాయికి ఐపీఎల్‌ ఫీవర్‌ చేరుకుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జోష్ తగ్గిందని వార్తలొస్తున్నాయి. 
 
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేకపోవడమో ఏమో కానీ ఐపీఎల్ 9వ సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయింది. ఇక టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ముందులా ఫామ్‌లో లేకపోవడం కూడా ఐపీఎల్‌కు మైనస్సైంది. సురేష్‌ రైనా డల్‌ అయిపోయాడు. ఇంకా చాలామంది చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్ళూ ఫేడయిపోయారు. దాంతో, క్రికెట్‌ అభిమానులు బాగా డీలా పడ్డారు. 
 
మొత్తానికి చెన్నై జట్టు ఔట్ కావడంతో ఐపీఎల్ కళ తప్పిందనే చెప్పాలి. ముంబై ఇండియన్స్‌ మంచి ఊపు మీదుంటే, కాస్తో కూస్తో ఐపీఎల్‌ 'కిక్కు' ఇచ్చేదేమోనని క్రీడా పండితుల అభిప్రాయం. వాస్తవానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వెలుగు చూశాకనే పరిస్థితి తేడా కొట్టేసింది. దీంతో ఈసారి ఐపీఎల్‌కు క్రేజ్ బాగా తగ్గిపోయిందనే చెప్పాలి.