1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (12:27 IST)

ఐపీఎల్ 2024.. శశాంక్ సింగ్ యాక్షన్ ఇన్నింగ్స్.. అసలు సంగతేంటంటే?

Shashank Singh
Shashank Singh
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 199 పరుగులు జోడించింది. 
 
ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు దూకుడుగా ఆడినా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమి అంచున నిలిచిన జట్టులో వెనుక వరుస ఆటగాడు శశాంక్ సింగ్ యాక్షన్ ఇన్నింగ్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 
 
29 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో శశాంక్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో పంజాబ్ జట్టు అతడిని కైవసం చేసుకుంది. కానీ పిక్ తర్వాత వారు తీసుకోవాలనుకున్న ఆటగాడు అతను కాదు. 
 
అదే పేరుతో మరో వ్యక్తిని తీసుకోకుండా అతడిని తీసుకున్నామని పేర్కొంది. కానీ వేలంలో అతడిని భర్తీ చేయలేమని ప్రకటించారు. అయితే ఇప్పుడు ముఖ్యమైన మ్యాచ్‌లో శశాంక్ జట్టును కాపాడాడని పంజాబ్ కింగ్స్ తెలిపింది.