బక్రీద్ పండుగ... త్యాగానికి ప్రతీకగా...

ముస్లింల రెండో పెద్ద పండుగ బక్రీద్. త్యాగానికి, దేవునిపై భక్తికి ఈ పండుగు తార్కాణంగా నిలుస్తోంది. అల్లాహ్ ఆదేసం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైనా ఇస్మాయిడ్‌ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన

Kowsalya| Last Updated: సోమవారం, 13 ఆగస్టు 2018 (14:29 IST)
ముస్లింల రెండో పెద్ద బక్రీద్. త్యాగానికి, దేవునిపై భక్తికి ఈ పండుగు తార్కాణంగా నిలుస్తోంది. అల్లాహ్ ఆదేసం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిడ్‌ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు.
 
ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్ ఉల్ హరామ్‌లో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు.
 
ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందురూ కాబా వైపు తిరిగి నమాజు చేస్తారు. దీనినే ఖిబ్లా అని కుడా అంటారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. 
 
రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆ తరువాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తరువాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.దీనిపై మరింత చదవండి :