శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (14:38 IST)

ఆండ్రాయిడ్ నుంచి కొత్త వెర్షన్.. ఇక ఫుడ్ ఐటమ్స్ పేర్లకు బై బై

ఆండ్రాయిడ్ నుంచి కొత్త వెర్షన్ రాబోతోంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ వెర్షన్లకు ఆహార పదార్థాలకు సంబంధించిన పేర్లను పెడుతూ వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ దిగ్గజం ఆండ్రాయిడ్.. ఆ సంప్రదాయాన్ని పక్కనబెడుతోంది. 
 
ఈసారి సంప్రదాయాన్ని పక్కనబెట్టిన ఆండ్రాయిడ్ తన లేటెస్ట్ వెర్షన్ కు సింపుల్ గా ఆండ్రాయిడ్-10 అంటూ నామకరణం చేసింది. ఈ మేరకు ఆండ్రాయిడ్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ విభాగం ఉపాధ్యక్షుడు సమీర్ సమత్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
 
ఇప్పటివరకు ఆండ్రాయిడ్ వెర్షన్లకు చాక్లెట్లు, క్యాండీలు, బేకరీ ఐటమ్స్, ఐస్‌క్రీములకు సంబంధించిన పేర్లు పెట్టడం ఆనవాయితీగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి సీన్ మారింది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, అందరికీ అర్థమయ్యేలా పేరు కొత్త వెర్షన్‌కు ఆండ్రాయిడ్-10 గా నామకరణం చేసినట్టు ఆండ్రాయిడ్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.