షియోమీ వాషింగ్ మెషీన్ వచ్చేస్తోంది.. దిగ్గజాలకు షాక్ తప్పదా?

Xiaomi Washing Machine
వాసు| Last Updated: బుధవారం, 20 మార్చి 2019 (17:28 IST)
వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక బ్రహ్మాండమైన వార్త. హ్యాండ్‌సెట్స్ తయారీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమి తాజాగా వాషింగ్ మెషీన్‌ల విభాగంలోకి కూడా ప్రవేశిస్తూ... రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

ఈ రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధర దాదాపు రూ.8,150 ఉండబోతోంది. చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 9 నుంచి అందుబాటులోకి రానున్న ఈ వాషింగ్ మెషీన్‌లు భారత్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు రానున్నాయి అనే విషయం ఇంకా తెలియలేదు. అయితే కంపెనీ వీటిని మన మార్కెట్‌లోకి తీసుకువస్తుందనేది మాత్రం ఖచ్చితమైన సమాచారం.

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌గా.. సింపుల్ డిజైన్‌తో తెలుపు రంగులో ఉండే ఈ మెషీన్... యాంటీ కొరోషన్ మెటల్ బాడీని కలిగి ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇందులో సెల్ఫ్ క్లీనింగ్ డ్రై ఫంక్షన్, 10 గ్రేడ్ వాటర్ లెవెల్ అడ్జస్ట్‌మెంట్, 10 రకాల వాషింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని సామర్థ్యం 8 కేజీలు. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 8 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగానే ఉంటుందని అంచనా.దీనిపై మరింత చదవండి :