1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (11:58 IST)

మునగకాడలు ఉడికించిన నీటిని సూప్‌లా పిల్లలకు తాగిస్తే.. మేలేంటి?

మునగకాడలతో కూరలు చేసుకుంటే ఆ రుచి అదిరిపోతుంది. మునగకాడల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని మాంసకృత్తులు, క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగకాడల్ని ఉడికించిన నీళ్లని సూప్‌‍లా చేసుకుని

మునగకాడలతో కూరలు చేసుకుంటే ఆ రుచి అదిరిపోతుంది. మునగకాడల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని మాంసకృత్తులు, క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగకాడల్ని ఉడికించిన నీళ్లని సూప్‌‍లా చేసుకుని తాగితే దగ్గూ, గొంతు నొప్పి వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. చిన్నారులకు ఈ సూప్‌ను తాగించడం ద్వారా శరీరానికి తగినంత క్యాల్షియం అందుతుంది. ఎముకలూ బలపడతాయి. 
 
అలానే ఇందులో ఉండే పోషకాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలున్నవారు మునగను తీసుకుంటే చాలామంచిది. మునగలో ఉండే ఐరన్.. గర్భిణీలు, బాలింతలకు మేలు చేస్తుంది. ఇందులోని థయామిన్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇక విటమిన్ ఎ.. యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇదెంతో మేలు చేస్తుంది.