1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (12:55 IST)

వేసవి కాలంలో పిల్లల్ని ఎత్తుకోకపోవడమే బెటర్....

వేసవి కాలంలో పిల్లల్ని ప్లాస్టిక్ చాపల మీద పడుకోనివ్వకూడదు. తాటాకులతో చేసిన చాపలను ఉపయోగించాలి. వాటిపై మెత్తని బెడ్‌షీట్ వేసి దానిపై పడుకోబెట్టాలి. తద్వారా చెమటకాయలు వంటి చర్మ సమస్యల నుంచి పిల్లలకు ఉప

వేసవి కాలంలో పిల్లల్ని ప్లాస్టిక్ చాపల మీద పడుకోనివ్వకూడదు. తాటాకులతో చేసిన చాపలను ఉపయోగించాలి. వాటిపై మెత్తని బెడ్‌షీట్ వేసి దానిపై పడుకోబెట్టాలి. తద్వారా చెమటకాయలు వంటి చర్మ సమస్యల నుంచి పిల్లలకు ఉపశమనం లభిస్తుంది. అలాగే వేసవిలో ఎక్కువసేపు ఎత్తుకోవడం మంచిది కాదు. పెద్దల శరీర వేడి పిల్లల చిరాకుకు కారణమవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.
 
పిల్లలకు నూలు దుస్తులు వేయాలి. అవి వదులుగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు వేసవిలో నీటిని ఎక్కువగా సేవించాలి. అప్పుడప్పుడు పాలు, పళ్లరసాలు కొద్దికొద్దిగా తాగించాలి. సాయంత్రం ఎండ చల్లబడిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. వేసవిలో పిల్లలకు డైపర్స్‌ వేయకపోవడం మంచిది. ఎండల్లో పిల్లలను బయటికి తీసుకెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్లాలనుకుంటే నీళ్లు, నిమ్మరసాలు, పండ్లు వంటివి చేతిలో పెట్టుకోవాలి. రాగి జావ రోజుకో కప్పు ఇవ్వాలి. దోసకాయలు, కర్బూజ, పుచ్చకాయ ముక్కల్ని పిల్లలకు తినిపించాలి. చిన్నారులైతే జ్యూస్‌ల రూపంలో ఇవ్వాలి. పప్పుధాన్యాలు, పప్పుతో చేసిన వంటకాలు, నేతిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. 
 
కాయగూరలు, పండ్లు వీలైనంత వరకు మితంగా ఇవ్వాలి. కొంచెంకొంచెంగా ఇస్తుండాలి. మాంసాహారం చికెన్ ఎక్కువ తినిపించకూడదు. చేపలు, మటన్, సీఫుడ్స్ తీసుకోవచ్చు. వాటిలో ఫ్రైడ్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకపోవడం మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.