మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (15:58 IST)

పిల్లలకు ఈ మూడింటిని తప్పకుండా నేర్పించండి!

పిల్లల పెరుగుదలపై ప్రస్తుత సామాజిక పరిస్థితులు బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. అందుచేత పిల్లలను ధైర్యంగా పెంచడంతో పాటు పరిస్థితికి అనుకూలంగా ప్రవర్తించేలా.. అనేత నైపుణ్యాలను అలవరుచుకునేలా పారెంట్స్ తీర్చిదిద్దాలి. అప్పడప్పుడు పిల్లలకు నైపుణ్యతో కూడిన పనులను నేర్పాలి. 
 
పిల్లలకు పాజిటివ్‌గా ఉండటాన్ని ముందుగా నేర్పించాలి. చిన్న చిన్న విషయాలకే అల్లరి చేయడం, అనుకున్నది సాధించుకోవడం వంటి ప్రవర్తనలు దూరం చేయాలి. పిల్లలు స్వతహాగా పాజిటివ్ ఉంటే.. వారు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. 
 
మగపిల్లాడైనా, అమ్మాయైనా ఇంటి పనులు నేర్పించండి. ఇంటిని శుభ్రం చేయడం, వాషింగ్, వంటల్లో సాయం చేయడం వంటివి ఎలా చేయాలో తెలుసుకునేలా నేర్పించండి. తల్లిదండ్రులు చేసే పనికి సహాయంగా ఉండమనండి. అలాగే పారెంట్స్ కూడా వారికి సహాయపడండి. హోం వర్క్, ప్రాజెక్ట్స్ ఇతరత్రా యాక్టివిటీస్‌ను గుర్తించి.. వారిని ప్రోత్సహించండి. 
 
పిల్లలకు ఈజీగా తయారు చేసే వంటకాలు నేర్పించాలి. అప్పుడే ఆకలైనప్పుడు వారికి వారే ఆసక్తిగా ఆహారం తీసుకోగలుగుతారు. ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ రోస్ట్ వంటితో పాటు కొన్ని వంటింటి చిట్కాలు నేర్పిస్తే.. అది పిల్లల జీవితానికి తోడ్పాటుగా ఉండటంతో పాటు తల్లిదండ్రుల శ్రమను కూడా తగ్గిస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.