ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By ivr
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (14:46 IST)

ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్....

ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ

ఆకొన్నకూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ
 
భావం : ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు.