గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (14:37 IST)

మహా శివరాత్రి... ఈ ఐదు పనులు అస్సలు చేయకండి.. ఎందుకు..? (Video)

మహాశివరాత్రి హిందువులు ఎంతో భక్తిభావంతో జరుపుకునే పండుగ. శివుని పండుగలన్నింటిలోను ముఖ్యమైనది మహాశివరాత్రి. ఆరోజున తెలియకుండా చేసే పనుల వల్ల ఆ స్వామి కృపాకటాక్షాలను పొందలేమట. అంతేకాదు ఐశ్వర్యహీనులవుతారట. సాధారణంగా మనం తెల్లవారుజామునే నిద్రలేవాలని అనుకుంటాం. కానీ కొందరు మాత్రమే దీనిని పాటిస్తారు.
 
అయితే శివరాత్రి రోజు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలట. ఈ తలస్నానం చేసేటప్పుడు షాంపులు, కుంకుడు కాయలను అస్సలు వాడకూడదట. ఇలా కుంకుడు, షాంపులతో చేయాలనుకుంటే ముందు రోజు చేయాలట. అలాగే ఆరోజు ఎవరూ కటింగ్, గడ్డం చేయించకూడదట. అలాగే ఆ రోజు తలకు నూనె కూడా పెట్టకూడదట. ఆ రోజంతా స్వామివారిని నిష్టతో భగవంతుడిని ధ్యానం చేయాలట. 
 
కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారిని పూజిస్తే చాలట. సంవత్సరం మొత్తం పూజించినంత పుణ్యం వస్తుందట. గుడిలో అభిషేకం చేసేటప్పుడు మీరు అక్కడ ఉంటే మీకు చమట పడితే ఆ చమట స్వామివారిపై అస్సలు పడకూడదట. అలా జరిగితే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యాలన్నీ నాశనమైపోతాయట. ఈ జన్మలో ఐశ్వర్యం లేకుండా పోతుందట. ఈ విషయంలో జాగ్రత్త వహించాలట. అలాగే శివుడి పూజించేటప్పుడు మొగలిపువ్వును అస్సలు వాడకూదట. అలాగే శివుడిని పాలాభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లను నోటితోగానీ, బ్లేడుతో గానీ కత్తిరించి శివుడికి అభిషేకం చేయకూడదట.
 
ఎప్పుడూ పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె ఈ ఐదింటితో శివారాధన చేసేటప్పుడు ఒక పాత్రలో తీసుకుని అభిషేకం చేయాలట. ప్లాస్టిక్ గ్లాస్‌లోగానీ, ప్లాస్టిక్ ప్యాకెట్లలో పోసి అభిషేకం చేయకూడదట. వాటిని కూడా వేరే పాత్రలో తీసుకుని అభిషేకం చేయాలి. విభూతి ధారణ చేయకుండా ఇవ్వకూడదట. శివనామాన్ని ఎక్కువగా చేయాలి. దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఉదయం, సాయంత్రం వేళ చేయాలి. స్తోమతను బట్టి దానాధర్మం చేయాలట. శివరాత్రి రోజు చేసే పనులే ఐశ్వర్యాన్ని కానీ దరిద్రాన్ని గానీ కలిగిస్తాయట.