ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (18:06 IST)

ఐదుగురు జవాన్లను కాల్చివేసిన సహ జవాను

పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ క్యాంపులో భారత సరిహద్దు దళానికి చెందిన ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఐదుగురు సాటి జావన్లను తుపాకీతో కాల్చివేశాడు. తనను తోటి జవాన్లు అవహేళనకు గురిచేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జవాను తన వద్ద తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మొత్తు ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో మరో జవాను కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.