1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (12:35 IST)

అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు వత్తులతో.. నది వద్ద దీపాలు పెడితే?

ఈ రోజు, ఫాల్గుణ అమావాస్య. ఈ అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు దారంతో వత్తి తయారు చేసి దీపం వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సంపద పెరుగుతుంది. 
 
అమావాస్య రోజు నది వద్దకు ఒక నది దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించడం.. ఎరుపు పువ్వులను తీసుకోవాలి. ఆ ఎర్రటి పువ్వులు నదిలో పారవేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, డబ్బు, లాభం కూడా పొందవచ్చు.
 
అమావాస్య రోజు ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.