ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:39 IST)

ఫిబ్రవరి 14 అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు.

వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. జనరల్ స్టోర్లు, సూపర్‌ మార్కెట్లలో మద్యం విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు.
 
ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదన్నారు. దీనికి బదులు ప్రజలు మద్యానికి బనిసలు కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని లేఖలో అన్నా హజారే సూచించారు.