బద్రీనాథ్ హైవే మూసివేత.. ఎందుకో తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ శిబిరానికి సమీపంలో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్ హైవేను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడుతుండగా కొంతమంది బృందం ఆప్రాంత నుండి పరిగెడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.
హైవేపై పడి ఉన్న రాళ్లను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్ నుండి బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి వెళ్లే రహదారులపై కొండచరియలు తరుచుగా విరిగిపడుతుంటాయని అధికారులు తెలిపారు.