ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:09 IST)

ఈ నెలాఖరుకు కరోనా ఉగ్రరూపం!

ఇప్పటికే దేశాన్ని వణికిస్తున్న కరోనా.. ఈ నెలాఖరుకు ఉగ్రరూపం దాల్చవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఏప్రిల్ చివరినాటికి పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో నమోదవుతాయని ఇండియన్ ఛెస్ట్ సొసైటీ వెల్లడించింది.

దేశంలో కొవిడ్-19 కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిజాముద్దీన్ ఘటన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. అయితే దేశంలో ఈ కేసులు ఇంకా తీవ్ర స్థాయికి చేరనట్లే కనిపిస్తోంది.

ఈ మేరకు ఇండియన్ ఛెస్ట్ సొసైటీ(ఐసీఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ చివరినాటికి భారత్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటాయని అభిప్రాయపడింది ఐసీఎస్.
 
12 గంటల్లో 6 మరణాలు
భారత్లో కరోనా వైరస్ ఇప్పటివరకు 2902 మందికి వైరస్ సోకింది. దేశంలో 2650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రాజస్థాన్లో తొలి కరోనా మరణం నమోదైంది. 

బికనీర్ పట్టణంలో ఓ 60 ఏళ్ల వద్ధురాలు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. రాష్ట్రంలో తాజాగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కొవిడ్-19 సోకిన వారి సంఖ్య రాజస్థాన్లో 191కి చేరింది.