గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (09:55 IST)

హస్తిన కుండపోత వర్షం - ఈదురు గాలులు - విద్యుత్ సరఫరా నిలిపివేత

rain
హస్తినలో సోమవారం తెల్లవారుజామున ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ గాలులతో చెట్లు విరిగిపడిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
మరోవైపు, విమాన ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రయాణికులు ఎప్పటికపుడు తన విమానాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత అధికారులతో టచ్‌లో ఉండాలని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షంతో పాటు.. గాలులు బలంగా వీస్తుండటంతో విమానాలు ఆలస్యంగా నడుస్తాయని వారు తెలిపారు.