శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రాజస్థాన్ లేడీ డాన్ అనురాధ చౌదరి అరెస్టు

రాజస్థాన్ లేడీ డాన్‌గా గుర్తింపు పొందిన అనురాధా చౌదరిని ఢిల్లీ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కాలా జతేది. కాలా భాగస్వామిగా ఈమె చెలామణి అవుతూ వచ్చారు. ఇపుడు ఈమెతో పాటు.. కాలాను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇటీవల ఈ గ్యాంగ్‌ గ్యాంగ్ ఇటీవల ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించారు. షహరాన్‌పూర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్ధారించింది. గ్యాంగ్‌స్టర్ కాలా తలపై 7 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 
 
సోనీపట్‌కు చెందిన జతేదిపై ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. రెజర్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న సుశీల్ కుమార్...  జతేదీ మేనల్లుడు సోను మహల్‌ను కూడా చితకబాదాడు. 
 
ఈ విషయం తెలిసిన జతేది చంపేస్తానంటూ సుశీల్ కుమార్‌ను హెచ్చరించాడు. జతేదిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌గ్ క్రైమ్ యాక్ట్ (MCCOCA)ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు.