శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (07:44 IST)

బావివద్దకు వెళ్లిన బాలిక.. కిడ్నాప్ చేసి రేప్ చేసిన బాలుడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మంచినీటి కోసం బావివద్దకు వెళ్లిన బాలికను ఓ బాలుడు కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడు. ఆ ఘటనను మరో యువకుడు వీడియో కూడా తీశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలిక మంచినీటి కోసం బావివద్దకు వెళ్లింది. ఆ బాలిక ఒంటరిగా బావివద్ద కనిపించడంతో ఓ బాలుడు ఆమెను కిడ్నాప్ చేసి బావి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాం చేశాడు. ఈ పైశాచికత్వాన్ని మరో బాలుడుతో అత్యాచారం చేయించాడు.
 
ఆ కామాంధుడు చెర నుంచి తప్పించుకుని వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. వీరంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.