శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 7 నవంబరు 2019 (14:55 IST)

అది తలుచుకుని శశికళకు రాత్రి వేళల్లో నిద్రపట్టడం లేదట?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆమె నెచ్చెలిగా ఉన్న శశికళ జైలుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ రాత్రి వేళల్లో అస్సలు నిద్రపోవడంలేదట. అందుకు ప్రధాన కారణంగా తన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి 1600 కోట్ల రూపాయలను స్వాధీనపరుచుకోవడమేనట. 
 
ఐటీ శాఖ అధికారులు చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరితో పాటు దాదాపు 37 ప్రాంతాల్లో శశికళ ఆస్తులపై రెండేళ్ళ క్రితం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన సోదాలో శశికళ అక్రమ ఆస్తులన్నీ బయటకు వచ్చాయి.

అయితే తాజాగా కూడా ఐటీ శాఖ అధికారులు పెరంబూర్‌లోని ఒక మాల్, ఓ రిసార్ట్స్, కోయంబత్తూరులోని పేపర్ మిల్, చెన్నైలో గంగఫౌండేషన్ పేరుతో ఉన్న స్పెక్ట్రమ్ మాల్, పుదుచ్చేరిలోని శ్రీ లక్ష్మి జ్యువెలరీ, అలాగే మరో రిసార్ట్‌ను గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
గత రెండురోజుల సోదాల్లో మొత్తం 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమ ఆస్తులను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు భోగట్టా. ఇవన్నీ తెలుసుకున్న శశికళకు కంటి మీద కునుకు రావడంలేదట.