చెన్నై నుంచి హౌరాకు మూడవ రైల్వే లైన్
పెరుగుతున్న రైల్వే అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నై నుంచి హౌరా వరకూ 3వ రైల్వే లైను నిర్మాణానికి రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు.
ఆయన తుని రైల్వే స్టేషను పరిశీలించారు. ఈ సందర్భంగా జిఎం మాల్యా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే చెన్నై హౌరా మధ్య మూడు రైల్వే లైన్ కు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టామని, ట్రాక్ నిర్మాణ పనులను త్వరలో చేపడతామని మాల్యా వివరించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా రైల్వేస్టేషన్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నమస్తే స్టేషన్లలో హాల్టు కల్పించాలని పలు విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ సాధ్యాసాధ్యాలను పరిశీలించి వలసిన అవసరం ఉందన్నారు. లాంగ్ జర్నీ చేసే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కోరిన చోటల్లా హాల్ట్ ఇచ్చుకుంటూ పోతే లాంగ్ జర్నీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన గుర్తు చేశారు. అనంతరం జనరల్ మేనేజర్ మాల్యా తుని రైల్వే స్టేషన్ లో అన్ని విభాగాలను తనిఖీ చేశారు.
రైల్వే స్టేషన్ హోటల్లో చిల్డ్రన్స్ పార్క్ ను ఆయన ప్రారంభించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పలు రైళ్లకు తునిలో హాల్ట్ కల్పించాలని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతాపార్టీ నాయకులు జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువచ్చారు. జనవరి నుంచి న్యూఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేస్తున్నందున ఏపీ ఎక్స్ ప్రెస్ కు తుని లో హార్ట్ కల్పించాలని తమలపాకులు ఎగుమతులు చేసే రైతులు జనరల్ మేనేజర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక కొండ వారి పేట రైల్వే తుమ్ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిఎం దృష్టికి వైసిపి యువనేత ఏలూరి బాలు తీసుకు వచ్చారు. రైల్వే తుమ్మునుజిఎం పరిశీలించి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.