శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:42 IST)

ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం: సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు

crime photo
రిసార్టులో పనిచేస్తోన్న19 ఏళ్ల యువతి హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్‌ ఆర్యకు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు దగ్గర్లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి గతవారం హత్యకు గురైంది. 
 
కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె 'ప్రత్యేక'సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్‌, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 
 
తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్‌ కాల్ వివరాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగిని ఒకరు తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించారు.